: ఎంఎంటీఎస్ రైలులో ప్రయాణించిన ద.మ.రైల్వే జీఎం
దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవ ఎంఎంటీఎస్ రైలులో ప్రయాణించారు. సికింద్రాబాద్-లింగంపల్లి ఎంఎంటీఎస్ లో ప్రయాణించిన ఆయన రైలులో సౌకర్యాలు, రైళ్ల సమయపాలనపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ లో రూ.2 కోట్లతో నిర్మించతలపెట్టిన పాదచారుల వంతెనకు రైల్వే జీఎం ఈ రోజు శంకుస్థాపన చేశారు. మహిళా ప్రయాణికుల రక్షణ కోసం రిస్తా యాప్ ను ఈ సందర్భంగా శ్రీవాత్సవ ప్రారంభించారు.