: మా దగ్గరా ఏసీబీ వుంది... మా ఎమ్మెల్యేలతో కవిత, కేటీఆర్, హరీష్ లు సాగించిన సంభాషణలు కూడా విడుదల చేయండి!: విరుచుకుపడ్డ ఏపీ తెదేపా


ఏసీబీ కేసీఆర్ చేతుల్లోనే కాదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికీ ఉందని తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్టీఫెన్ తో చంద్రబాబు మాటల రికార్డులు ఉన్నాయని చెబుతూ, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. "సంవత్సర కాలంగా కవిత, కేటీఆర్, హరీష్ రావులు మా ఎమ్మెల్యేలతో ఏం సంభాషించారో ఆ టేపులు కూడా బయటకు తీయండి. బండారం బయటపడుతుంది. మా పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను, ఐదుగురు ఎమ్మెల్సీలను కొన్నారు. ఆ బేరసారాలు కూడా బయటకు తీయండి. వాటిని కూడా విడుదల చేస్తే బాగుంటుంది" అన్నారు చంద్రమోహన్ రెడ్డి. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్ పై తమకూ హక్కులు ఉన్నాయని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం చేతుల్లోనూ ఓ అవినీతి నిరోధక శాఖ ఉందన్న విషయాన్ని కేసీఆర్ సర్కారు గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News