: ఏపీ ప్రైవేటు మెడికల్ సెట్ పరీక్షా ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన మెడికల్ సెట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో మంత్రి కామినేని శ్రీనివాస్ ఫలితాలను విడుదలచేశారు. 75 శాతం మార్కులు, ఇంటర్ వెయిటేజీ కలిపి ర్యాంకులు ప్రకటిస్తామని ఆయన తెలిపారు. మంత్రితో పాటు ఈ కార్యక్రమంలో పలువురు విశ్వవిద్యాలయ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ ఫలితాల్లో ప్రథమ ర్యాంకు తంగెళ్ల ఆదర్శవర్థన్ 153 మార్కులు, రెండవ ర్యాకు అమ్మిరెడ్డి వెంకట శివకృష్ణారెడ్డి 145 మార్కులు, పి.సాయిగోపాల్, నితీష్ కుమార్ లు 144 మార్కులతో మూడవ ర్యాంకులో నిలిచారని మంత్రి కామినేని వెల్లడించారు. మెడికల్ కు సంబంధించి 650 నుంచి 700 సీట్లు, డెంటల్ కు సంబంధించి 386 సీట్లు అందుబాటులో ఉంటాయని, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక మేరకు సీట్ల కేటాయింపు జరుగుతుందని వివరించారు.