: సురేష్ కల్మాడీకి ఆసియా అథ్లెటిక్స్ టాప్ అవార్డు
కామన్ వెల్త్ గేమ్స్ స్కాంకు పాల్పడిన సురేష్ కల్మాడీకి ఆసియా అథ్లెటిక్స్ అసోసియేషన్ (ఏఏఏ) ప్రెసిడెంట్ అవార్డ్ లభించింది. ఆసియాలో అథ్లెటిక్స్ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారలు అందించినందుకు గానూ ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. వూవాన్ లో జరిగిన ఏఏఏ గాలా డిన్నర్, అవార్డ్ సెర్మనీలో కల్మాడీ తరపున ఆ పురస్కారాన్ని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అదిల్లే స్వీకరించారు. 2010 కామన్ వెల్త్ క్రీడల్లో జరిగిన కుంభకోణంలో అరెస్టైన కల్మాడీ తరువాత బెయిల్ పై విడుదలయ్యారు. కొన్ని నెలల కిందటే ఆయన ఆసియా అథ్లెటిక్స్ అసోసియేషన్ జీవితకాల అధ్యక్షుడుగా నియమితులయ్యారు.