: బహిరంగ మూత్ర విసర్జనతో చీవాట్లు తిన్న ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో
అతని పేరు చెబితే ఫుట్ బాల్ అభిమానులు ఎగిరి గంతేస్తారు. అమ్మాయిలు పడి చచ్చిపోతారు. అతడే రియల్ మాడ్రిడ్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో. అంత పేరుంటే మాత్రం ఏం? నడిరోడ్డుపై బహిరంగ మూత్ర విసర్జన చేసి 'ఛీ' కొట్టించుకున్నాడు. ఈ ఘటన సెయింట్ ట్రోపెజ్ లో జరిగింది. తెల్లవారుజాము వరకూ స్నేహితులతో కలసి పార్టీ చేసుకున్న రొనాల్డో, బయటకు వచ్చి ఈ పని చేశాడు. ఇక్కడి ఓల్డ్ హార్బర్ ఏరియాలోని ఓ ఐస్ క్రీం షాపు ముందు పని కానిచ్చేశాడు. ఈ ఉదంతాన్ని కొందరు ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టేశారు. రొనాల్డో చేసిన పని పట్ల తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆయన వీరాభిమానులు సైతం తిట్లకు దిగారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు రొనాల్డోకు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు.