: ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ ఎమ్మెల్సీలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన తెలంగాణ రాష్ట్ర నూతన ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీఆర్ఎస్ సభ్యులు నేతి విద్యాసాగర్, యాదవరెడ్డి, బొడకుంటి వెంకటేశ్వర్లు చేత శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. 11.30 గంటలకు కాంగ్రెస్ తరపున ఎన్నికైన ఆకుల లలిత ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 1న జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీరంతా గెలుపొందిన సంగతి తెలిసిందే.