: ఉద్యోగులకు వేతనాలు పెంచిన విప్రో
ఇండియాలోని మూడవ అతిపెద్ద సాఫ్ట్ వేర్ సేవల సంస్థ విప్రో, తమ ఉద్యోగులకు 7 శాతం మేరకు వేతనాలు పెంచింది. "అర్హులైన ఉద్యోగుల వేతనాలను పెంచాము. జూన్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. సరాసరిన వేతనాలు 7 శాతం పెరిగాయి" అని విప్రో మానవ వనరుల విభాగం హెడ్ సౌరభ్ గోవిల్ తెలిపారు. మంచి పనితీరు చూపుతున్న ఉద్యోగుల వేతనాలు ఇతరులతో పోలిస్తే ఎక్కువగా పెరిగాయని, జూనియర్ స్థాయి ఉద్యోగులకు వేతనాలను ఒకే స్థాయిలో పెంచామని ఆయన తెలిపారు. కాగా, మార్చి 31 నాటికి విప్రోలో మొత్తం 1,58,217 మంది ఉద్యోగులు విధులను నిర్వహిస్తున్నారు. విప్రోకు ప్రధాన పోటీదారులుగా ఉన్న ఇన్ఫోసిస్ లో 6.5 నుంచి 9 శాతం, టీసీఎస్ లో సరాసరిన 8 శాతం వరకూ వేతనాలు పెరిగిన సంగతి తెలిసిందే.