: 'భూమి పూజ'కు వేళయింది, అనుమతించండి: బాబు సర్కారు వేడుకోలు


శాసన మండలి ఎన్నికల వేళ కోడ్ అమల్లో ఉండడంతో చంద్రబాబు సర్కారు ఇరుకున పడింది. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ఈ నెల 6న భూమిపూజకు ముహూర్తం పెట్టుకున్న ప్రభుత్వం కోడ్ కారణంగా దాన్ని జరిపించే వీలు లేకపోవడంతో, ఎలాగైనా అనుమతించాలని ఎన్నికల కమిషన్ ను కోరింది. దీంతో పాటు పరిపాలన ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా నాగార్జున సాగర్ లో తలపెట్టిన సభకు కూడా అనుమతించాలని ఈసీని కోరింది. విశాఖపట్నం, విజయనగరం, కృష్ణా తదితర జిల్లాలతో పాటు గుంటూరులో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండడంతో అక్కడ ప్రభుత్వపరంగా ఎటువంటి అధికారిక కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలు లేదు. ఈ నేపథ్యంలో భూమిపూజ లాంఛనాన్ని ఎలాగైనా పూర్తి చెయ్యాలన్న తలంపుతో ఏపీ ప్రభుత్వం ఈసీని ఆశ్రయించింది.

  • Loading...

More Telugu News