: చిన్న పిల్లలు హారర్ సినిమాలు చూస్తే మంచిదేనట!: లండన్ పరిశోధకుల అధ్యయనం
'ఈవిల్ డెడ్', 'ఎక్జార్సిస్ట్', 'కాష్మోరా' వంటి హారర్ చిత్రాలు టీవీలో వస్తుంటే, పెద్దలు చూసేందుకే ఒకింత భయపడతారు. ఇక వాటిని చిన్న పిల్లలు చూస్తామంటే, ససేమిరా ఒప్పుకోని తల్లిదండ్రులు ఎంతమందో. ఈ తరహా భయంకర చిత్రాలు చూసి భయాందోళనలకు గురై మానసిక సమస్యలు తెచ్చుకుంటారన్నది పెద్దల భయం. అయితే, ఇకపై అటువంటి భయాలేమీ పెట్టుకోకుండా చిన్నారులను హారర్ సినిమాలు చూడనివ్వండని అంటున్నారు లండన్ పరిశోధకులు. భీతిగొల్పే చిత్రాలు చూసి భయపడతారన్నది పూర్తి వాస్తవం కాదని, చాలా కొద్ది మంది పిల్లలు మాత్రమే ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటారని పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఆ కొద్దిమంది కూడా ఎందుకు భయపడుతున్నారన్న విషయమై మరింత పరిశోధన జరగాల్సి వుందని అధ్యయనంలో పాల్గొన్న ఫీల్డ్ అనే పరిశోధకుడు వెల్లడించారు. అధ్యయనం వివరాలు ‘హ్యూమన్ కమ్యూనికేషన్ రీసెర్చ్’ అనే జర్నల్ లో ప్రచురితమయ్యాయి.