: ప్రయాణికులకు నరకం చూపించిన ఎయిర్ కోస్టా విమానం... స్పృహ కోల్పోయిన ఇద్దరు ప్రయాణికులు
విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి చెన్నై వెళ్లాల్సిన ఎయిర్ కోస్టా విమానం ప్రయాణికులకు నరకం చూపించింది. ఈ సాయంత్రం 4.30 గంటలకు చెన్నై వెళ్లడానికి టేకాఫ్ తీసుకునే సమయంలో విమానం ఇంజిన్ మొరాయించింది. దీంతో విమానం రన్ వే పై నిలిచిపోయింది. ఇదే సమయంలో సాంకేతిక కారణాలతో విమానంలోని డోర్లు తెరుచుకోలేదు. అంతేకాకుండా విమానంలోని ఏసీ కూడా ఆగిపోయింది. అరగంటలో సమస్య పరిష్కారం అవుతుందని విమాన సిబ్బంది ప్రయాణికులకు తెలిపారు. అయితే, గంటలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాలేదు. దాదాపు రెండున్నర గంటల తర్వాత డోర్లు తెరుచుకున్నాయి. ఈ సమయంలో విమానంలోని ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. ఇద్దరు ప్రయాణికులు ఏకంగా స్పృహ తప్పి పడిపోయారు. బయటకు వచ్చిన అనంతరం, విమాన సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు.