: ఏపీలో 540కి పెరిగిన 'నిట్' సీట్లు... వరంగల్ 'నిట్'లో 50 శాతం తెలంగాణకే


ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని నిట్ సీట్ల సమస్యను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పరిష్కరించింది. తెలంగాణలోని వరంగల్ లో ఉన్న నిట్ లో మొత్తం 740 సీట్లు ఉన్నాయి. ఇందులో 370 సీట్లను తెలంగాణకు, మిగిలిన 370 సీట్లను జాతీయ కోటాకు కేటాయించింది. ఇక ఏపీ విషయానికి వస్తే, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్ లో సీట్ల సంఖ్యను 120 నుంచి 540కి పెంచింది. ఇందులో ఏపీకి 300 సీట్లను కేటాయించగా... మిగిలిన 240 సీట్లను జాతీయ కోటాలో భర్తీ చేయనున్నారు.

  • Loading...

More Telugu News