: ఫిలిప్పీన్స్ హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం... 75 మంది మృతి


ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని ఓ హోటల్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 75 మంది దుర్మరణం పాలయ్యారు. మనోర్ అనే హోటల్ లోని మూడో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. హోటల్ లో బస చేసిన వారు తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ... బయటపడటానికి సరైన మార్గం లేకపోవడంతో ఇంతమంది బలయ్యారు. మరో 35 మంది కాలిన గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. కొంతమంది మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ఈ హోటల్ కు ప్రమాదం సంభవించే అవకాశం ఉందని గతంలోనే హెచ్చరిక జారీ చేసినా, హోటల్ యాజమాన్యం చర్యలు తీసుకోకపోవడంతో, ఇంత దారుణం జరిగింది.

  • Loading...

More Telugu News