: భారత్ ను శాశ్వతంగా వదల్లేదు: తస్లీమా నస్రీన్
బంగ్లాదేశ్ కు చెందిన రచయిత్రి, మానవహక్కుల కార్యకర్త తస్లీమా నస్రీన్ తన నివాసాన్ని భారత్ నుంచి అమెరికాకు మార్చారు. ఇస్లామిక్ రాడికల్స్ నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో, ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఆమె మాట్లాడుతూ, తాను భారత్ ను శాశ్వతంగా వదల్లేదని, మళ్లీ సురక్షితం అని భావించినప్పుడు తిరిగి వస్తానని చెప్పారు. బంగ్లాదేశ్ ఇస్లామిక్ అతివాదుల నుంచి తస్లీమా ప్రాణాలకు ముప్పు ఉంది. బంగ్లాదేశ్ లో లౌకికవాదం గురించి ప్రచారం చేస్తున్న విషికుర్ రహ్మాన్, అనంత బిజోయ్, అవిజిత్ రాయ్ లు వరుసగా హత్యకు గురవడంతో తస్లీమా అమెరికాకు వెళ్లారు. న్యూయార్క్ అడ్వొకసీ గ్రూప్ ఫర్ ఎంక్వైరీ తస్లీమాకు భద్రత కల్పిస్తోంది.