: మోడల్ ఎముకల గూడులా ఉందంటూ యాడ్ పై నిషేధం విధించిన ఏఎస్ఏ
యూకేలో అడ్వర్టయిజ్ మెంట్స్ స్టాండర్డ్స్ అథారిటీ (ఏఎస్ఏ) ఓ యాడ్ ను నిషేధించింది. ఈవ్స్ సెయింట్ లారెంట్ వాణిజ్య ప్రకటనలో కనిపించిన మోడల్ మరీ బక్కగా ఉందని, బహుశా ఆమె అనారోగ్యంపాలై ఉండవచ్చంటూ ఏఎస్ఏ సదరు యాడ్ కు 'నో' చెప్పింది. ఆ యాడ్ ను ప్రచురించరాదని స్పష్టం చేసింది. ఎల్లీ యూకే మ్యాగజైన్ లో ఈ అడ్వర్టయిజ్ మెంట్ దర్శనమిచ్చింది. ఆ మోడల్ ఎముకల గూడులా ఉందని ఏఎస్ఏ పేర్కొంది. అలాంటి మోడళ్లను ప్రకటనల్లో చూపించడం బాధ్యతారాహిత్యమని పేర్కొంది.