: ఆస్తులు కాపాడుకోవడానికే కేసీఆర్ తో జగన్ కుమ్మక్కయ్యారు: మంత్రి ఉమా
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారంలో టీఆర్ఎస్ కు మద్దతుగా వ్యవహరిస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ధ్వజమెత్తారు. తెలంగాణలో ఉన్న ఆస్తులు కాపాడుకోవడానికే జగన్ టీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారని విమర్శించారు. జగన్ చేస్తున్న కుట్ర రాజకీయాలు తమ వద్ద పనికిరావని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఉమా హెచ్చరించారు. పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కు అప్పజెప్పి, టీడీపీని దెబ్బతీయాలనే కుట్రలో ఆయన భాగస్వామి అయ్యారని ఉమా ఆరోపించారు. ఇలాంటి కుట్ర రాజకీయాలకు తాము భయపడమని ఆయన హెచ్చరించారు. లక్ష కోట్ల దోపిడీలో ఏ1 ముద్దాయి అయిన జగన్ తమకు ప్రతిపక్ష నాయకుడు కావడం తమ కర్మ, దౌర్భాగ్యమని మంత్రి అన్నారు.