: మోదీ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు: ఆనంద్ శర్మ


ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ ఆర్ఎస్ఎస్ ప్రచారకుడిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆయన నిక్కర్లు వేసుకోకముందు నుంచే ఇండియాకు గుర్తింపు ఉందని, ఏళ్ల తరబడి దేశం సాధించిన విజయాలను ఆయన గుర్తించలేకపోతున్నారని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన మాట్లాడారు. మోదీ మానసిక పరిస్థితి బాగోలేదని శర్మ విమర్శించారు. ఆయన పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదన్నారు. దేశం మొత్తం స్కాంలకు పాల్పడినట్టుగా ప్రధాని వ్యవహరించడం సరికాదని చెప్పారు. వాజ్ పేయి పథకాల పేర్లను యూపీఏ మార్చిందనడం సరికాదని, యూపీఏ పథకాల పేర్లను ఎన్డీఏ సర్కారే మారుస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయాల్లో మోదీ ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలు కాలేదన్నారు. సంవత్సర పాలనంతా కేవలం ప్రచార ఆర్భాటమేనని ఆనంద్ శర్మ ఆరోపించారు. కాగా, కాంగ్రెస్ వల్లే తెలంగాణ ఏర్పాటైందని ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News