: 'ఆంధ్రాపోరి' టైటిల్ వివాదంపై తీర్పు రేపటికి వాయిదా
'ఆంధ్రాపోరి' టైటిల్ వివాదంపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. దాంతో తీర్పు రేపటికి వాయిదా పడింది. మహిళలను అభ్యంతరకరంగా చూపించే విధంగా, తమ మనోభావాలను కించపరిచే విధంగా ఈ చిత్రం టైటిల్ ఉందంటూ ఆంధ్రా సెటిలర్స్ ఫోరం ఈ రోజు కోర్టును ఆశ్రయించింది. దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఉల్కాగుప్తా కథానాయికగా నటించింది.