: ఘనంగా టీఎస్ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఆయన అభిమానులు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో జరిగిన ఈ వేడుకల్లో భారీ కేకును కట్ చేశారు. హరీష్ ను పూలమాలతో సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మినిస్టర్స్ క్వార్టర్స్ లో కోలాహలం నెలకొంది.