: చంద్రబాబుపై మంత్రి నాయిని వ్యాఖ్యలను ఖండించిన టీ.టీడీపీ


ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసులో సీఎం చంద్రబాబు ప్రధాన కుట్రదారు అని, ఆధారాలు ఉన్నాయని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి చేసిన వ్యాఖ్యలను టీ.టీడీపీ నేతలు ఖండించారు. ఆయన మాటలు బాధ్యతారాహిత్యమని టీడీపీ నేతలు ఎల్.రమణ, ఎ.నర్సారెడ్డి, సండ్ర వెంకటవీరయ్య తదితర నేతలు ఆక్షేపించారు. ఈ వ్యవహారమంతా కుట్ర ప్రకారం జరుగుతోందన్నారు. కేసీఆర్, జగన్ లు రహస్య మిత్రులని రమణ విమర్శించారు. రేవంత్ వీడియోలు కొన్ని చానళ్లకే ముందుగా బహిర్గతమవడంపై విచారణ జరపాలని కోరారు. కేవలం మూడు ఎమ్మెల్సీ స్థానాలే గెలిచే బలమున్న టీఆర్ఎస్ ఐదు స్థానాలు ఎలా గెలిచిందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణలో ఏ సమస్యపైనా గవర్నర్ ను కలవని జగన్ చంద్రబాబుపై ఫిర్యాదు చేయడానికి కలవడం దురుద్దేశపూర్వకమని సండ్ర మండిపడ్డారు.

  • Loading...

More Telugu News