: నిజామాబాద్-ఆర్మూర్ రైల్వే లైన్ కు భూమిపూజ


ఈ రోజు నిజామాబాద్-ఆర్మూర్ రైల్వే లైన్ కు భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, గత పాలకులు నిజామాబాద్ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ప్రస్తుత పాలనలో జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు పుట్టగతులు కూడా ఉండవని జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకే టీడీపీ అధినేత చంద్రబాబు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News