: సోమేష్ కుమార్ పదవీకాలం పెంపు
జీహెచ్ఎంసీ ప్రత్యేక అధికారి సోమేష్ కుమార్ పదవీకాలాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహిత అధికారుల్లో సోమేష్ కుమార్ కూడా ఒకరుగా గుర్తింపు పొందారు. ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా, సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయించినప్పటికీ, మ్యూచువల్ బదిలీ కింద సోమేష్ కుమార్ ను తెలంగాణకే తెచ్చుకున్నారు కేసీఆర్. ప్రస్తుతం ఆయన పదవీకాలం ముగిసినప్పటికీ మరో ఆరు నెలల పాటు పదవిలో కొనసాగించనున్నారు. ఈ మేరకు టీఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది.