: గూగుల్ బాటలో అమెజాన్... హైదరాబాదుకు మహర్దశ


ప్రముఖ సంస్థ అమెజాన్ హైదరాబాదులో అతిపెద్ద యూనిట్ నిర్మించనుంది. ఇప్పటికే సెర్చ్ ఇంజిన్ జెయింట్ గూగుల్ హైదరాబాదులో భారీ క్యాంపస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం తెలిసిందే. ఇప్పుడు అమెజాన్ కూడా భాగ్యనగరానికి రానుండడంతో ఐటీ పరిశ్రమ మరింత ఊపందుకోనుంది. అమెజాన్ హైదరాబాదులో ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్ (ఎఫ్ సీ)ను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రానికి ఐటీ రంగంలో రూ. 1,20,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఏడాదిగా ఆయన పలు దేశాల్లో పర్యటించి, పెట్టుబడిదారులతో చర్చలు జరిపారు. తెలంగాణలో ఎన్నో రాయితీలు కల్పిస్తామని వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థల రాకతో కేటీఆర్ ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తున్నాయి. ఓ మొబైల్ తయారీ దిగ్గజం కూడా హైదరాబాదులో మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News