: వివాదంలో 'ఆంధ్రాపోరి' టైటిల్... హైకోర్టులో ఆంధ్రా సెటిలర్స్ ఫోరం పిటిషన్


'ఆంధ్రాపోరి' సినిమా టైటిల్ వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రం పేరు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ ఆంధ్రా సెటిలర్స్ ఫోరం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మహిళలను అభ్యంతరకరంగా చూపించే విధంగా టైటిల్ ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే తెలంగాణ ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ అయిన చిత్రం టైటిల్ ను మార్చాలని సెటిలర్స్ ఫోరం కోరినప్పటికీ చిత్ర యూనిట్ ఇప్పటివరకు స్పందించలేదని తెలిపింది. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరపనుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ ఈ చిత్రంతో తొలిసారి హీరోగా పరిచయం కాబోతున్నాడు. రాజ్ మాదిరాజు దీనికి దర్శకుడు.

  • Loading...

More Telugu News