: ఎలా చంపాలి? ఎలా చనిపోవాలి?... నెట్ లో తెలుసుకుని పని పూర్తిచేశాడు!
ఇంగ్లండ్ లోని బ్రాడ్ ఫోర్డ్ లో గత సంవత్సరం ఓ ఎన్నారై కుటుంబం విషాదకరరీతిలో ప్రాణాలు విడవడం సంచలనం సృష్టించింది. జితేంద్ర లాడ్ అనే ఐటీ మేనేజర్ తన భార్య దక్షాబెన్, కుమార్తెలు త్రిష, నిషలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నట్టు తేలింది. తాజాగా, ఈ ఉదంతంపై అధికారులు మరిన్ని వివరాలు వెల్లడించారు. ఈ దారుణానికి పాల్పడే ముందు జితేంద్ర, ఎలా చంపాలి? ఎలా ఆత్మహత్య చేసుకోవాలి? అన్న విషయమై ఇంటర్నెట్లో తీవ్రంగా శోధించాడట. ముఖ్యంగా, గొంతు కోసి చంపడం గురించి ఎక్కువగా వెదికాడట. చాలా రోజుల పాటు జితేంద్ర ఇదే విషయమై కసరత్తులు చేశాడని పోలీసులు వివరించారు. డిప్రెషన్ కు గురైన కారణంగానే జితేంద్ర భార్యాబిడ్డలను చంపి, తానూ ఉరి వేసుకుని తనువు చాలించాడని వారు తెలిపారు.