: యోగా టీచర్ గా ప్రధాని మోదీ... ఈ నెల 21న యోగా డే సందర్భంగా కొత్త అవతారం!


ప్రధాని నరేంద్ర మోదీ మరో కొత్త అవతారం ఎత్తనున్నారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న మోదీకి యోగాసనాలపై ఆసక్తి ఎక్కువే. గుజరాత్ సీఎంగానే కాక పీఎం పీఠమెక్కినా, ఆయన ప్రతిరోజూ తెల్లవారుజామున యోగాసనాలు వేస్తూనే ఉన్నారు. అంతేకాదండోయ్, వీలు చిక్కితే యోగా పాఠాలు చెప్పేందుకూ ఎంతమాత్రం సంకోచించరు. ఇక ప్రధాని పదవి చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులూ క్రమం తప్పకుండా యోగాసనాలు వేయాలని, తద్వారా పనితీరు మెరుగుపడుతుందని ఏకంగా అధికారిక ఉత్తర్వుల ద్వారా సూచించారు. తాజాగా ఈ నెల 21న యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు కేంద్రం సంకల్పించింది. యోగా డే సందర్భంగా ఢిల్లీలోని రాజ్ పథ్ లో సామూహిక యోగాసనాలకు కేంద్రం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమంలో మోదీ యోగా గురువుగా కనిపించనున్నారట.

  • Loading...

More Telugu News