: ఆఫీసు పనివేళల్లో నిలబడి కూడా పనిచేస్తే మంచిదట!
ప్రస్తుత కాలంలో ఆఫీసుల్లో కంప్యూటర్ ముందు కూర్చుని గంటల తరబడి పని చేయడం చూస్తుంటాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పరిస్థితి ఉంటుంది. అలాగాకుండా పనివేళల్లో రోజుకు రెండు గంటలు నిలబడి పని చేయాలని బ్రిటన్ కు చెందిన పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్, సీఐసీ అనే స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. మన మొత్తం పని సమయాన్ని ముందుగా కూర్చొని, నిలబడి చేసే పని సమయాలుగా విభజించుకోవాలని, ఆ విధంగా కనీసం రోజుకు రెండు గంటలు నిలబడి పనిచేస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని తెలిపాయి. ఆ రెండు గంటల సమయాన్ని నాలుగు గంటలకు పెంచుకోవాలంటున్నారు. సాధారణగా ఆఫీసు వేళల్లో ఉద్యోగులు 65 నుంచి 75 శాతం సమయం కూర్చొనే పనిచేస్తారని, ఇందులో 50 శాతం సమయం సుదీర్ఘంగా కూర్చునే ఉంటారని పేర్కొంది. అలాకాకుండా పని వేళల్లో అప్పుడప్పుడు నడవడం చాలా మంచిదని విశ్లేషకులు అంటున్నారు.