: వ్యభిచార కూపంలో టాలీవుడ్ నటి... విముక్తి కల్పించిన గోవా పోలీసులు


తెలుగు చిత్రసీమ టాలీవుడ్ కు చెందిన ఓ నటి వ్యభిచార కూపంలో చిక్కుకుపోయింది. తెలుగుతో పాటు హిందీ చిత్రాల్లోనూ నటిస్తున్న సదరు నటికి ఆ కూపం నుంచి గోవా పోలీసులు విముక్తి కల్పించారు. వివరాల్లోకెళితే... గోవాలోని పనాజీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ పై నిన్న ఆ రాష్ట్ర పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఆయేషా సయ్యద్ అనే మహిళా బ్రోకర్ ను అరెస్ట్ చేశారు. ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేసే బడా బాబులకు అమ్మాయిలను సరఫరా చేసే ఆయేషా ఉచ్చులో టాలీవుడ్ నటి చిక్కింది. అంతేకాక పెద్ద సంఖ్యలో అమాయక యువతులను కూడా ఆయేషా ట్రాప్ చేసింది. విశ్వసనీయ సమాచారం అందుకున్న గోవా పోలీసులు ఓ వ్యక్తిని ఆయేషా వద్దకు పంపి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో భాగంగా ఆయేషాకు సహకరిస్తున్న మరో వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఆయేషాను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె ట్రాప్ కు చిక్కిన యువతులకు విముక్తి కల్పించారు. వీరిలో టాలీవుడ్ నటి కూడా ఉంది. ప్రభుత్వ మహిళా పునరావాస కేంద్రానికి తరలించిన సదరు నటి పేరును వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు.

  • Loading...

More Telugu News