: చంద్రబాబుకు నిద్ర పట్టట్లేదట... రేవంత్ ఉదంతంతో కలత చెందిన ఏపీ సీఎం


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి రెండు రోజులుగా నిద్రపట్టడం లేదట. ఎందుకంటే, తెలంగాణలో ఆయన పార్టీకి చెందిన కీలక నేత రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ ఎమ్మెల్యే ఓటు కొనబోయి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. ఈ ఉదంతం చంద్రబాబును తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. నిన్న విజయవాడలో నవ నిర్మాణ దీక్ష చేపట్టిన చంద్రబాబు, దీక్ష ముగిసిన అనంతరం అక్కడి గెస్ట్ హౌస్ లో మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, కామినేని శ్రీనివాస్ లతో పాటు సీఎస్ ఐవీఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు, అడిషనల్ డీజీ గౌతం సవాంగ్ లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. రేవంత్ రెడ్డి అరెస్టైన నాటి నుంచి తనకు నిద్రం పట్టడం లేదని, మానసికంగానూ ఇబ్బంది పడుతున్నానని ఆయన అన్నారట. అదే సమయంలో రేవంత్ బెయిల్ పిటిషన్ వాయిదా పడ్డ విషయాన్ని అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట. దీంతో చంద్రబాబు మరింత ఇబ్బంది పడ్డారట.

  • Loading...

More Telugu News