: ఆ ఘనత ఆర్టీసీ కోల్పోయినట్టే... నేటి నుంచి రెండుగా విభజన!


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక సంఖ్యలో బస్సులు, ప్రయాణ ప్రాంగణాలు కలిగి ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా సంస్థగా ఖ్యాతిగాంచిన ఏపీఎస్ఆర్టీసీ ఇకపై ఆ ఘనతను కోల్పోనుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో నేటి నుంచి ఆ సంస్థ రెండుగా విడిపోయింది. ఇప్పటికే వేర్వేరు పద్దులు ఏర్పాటైనా, నేటి నుంచి అధికారికంగా విడిపోనుంది. ఆస్తులు, అప్పులు తదితరాల విభజన కాస్త ఆలస్యమవడం మినహా, నేటి నుంచి సంస్థ ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీలుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగించనుంది. హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని బస్ భవన్ కు చెందిన ఏ బ్లాక్ నుంచి ఏపీఎస్ఆర్టీసీ, బి బ్లాక్ నుంచి టీఎస్ఆర్టీసీ తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టనున్నాయి. ప్రస్తుతం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న సాంబశివరావు, ఇకపై ఏపీఎస్ఆర్టీసీకి మాత్రమే ఎండీగా కొనసాగుతారు. జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఉన్న రమణరావు టీఎస్ఆర్టీసీకి తాత్కాలిక ఎండీగా కొనసాగనున్నారు. ఇక ఆస్తుల విషయంలో ఎక్కడి ఆస్తులు అక్కడే అన్న ప్రాతిపదికన పంపిణీ అయ్యే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News