: స్టెప్పులేసిన తలసాని... తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో అరుదైన దృశ్యం
తెలంగాణ తొలి ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి మొదలైన వేడుకలు ఈ నెల 7 దాకా నిర్విరామంగా కొనసాగనున్నాయి. ఆవిర్భావ వేడుకల్లో ఊరూవాడా ఆనందంలో తేలియాడాయి. ఈ సంబరాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ సహా మంత్రులు, పార్టీ నేతలు, ఉద్యమకారులు, విపక్ష పార్టీల నేతలు పాలుపంచుకున్నారు. హైదరాబాదులో ఏర్పాటు చేసిన సంబరాల్లో వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఏకంగా స్టెప్పులేసి మరీ తెలంగాణ వాదులను ఆకట్టుకున్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి, ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ పాటందుకోగా, తలసాని స్టెప్పులేసి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.