: తప్పు చేస్తే ఉరేసుకుంటా... మీడియాపై అయ్యన్న ఫైర్!


టీడీపీ సీనియర్ నేత, ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మీడియాపై ఫైరయ్యారు. ఇప్పటిదాకా తానెలాంటి తప్పు చేయలేదన్న ఆయన, తప్పు చేస్తే ఉరేసుకుంటానని వ్యాఖ్యానించారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో నేటి ఉదయం నవ నిర్మాణ దీక్షను ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియా కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై మీడియాలో అవాస్తవాలతో కూడిన కథనాలు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా తప్పుడు కథనాలను రాయడం మానుకోవాలని ఆయన మీడియా ప్రతినిధులకు సూచించారు.

  • Loading...

More Telugu News