: రేవంత్ రెడ్డి... ఖైదీ నెంబర్ 4170: చంచల్ గూడ నుంచి చర్లపల్లి జైలుకు తరలింపు
ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి... ఖైదీ నెంబర్ 1779 కాదు. ఆయన ఇప్పుడు ఖైదీ నెంబర్ 4170. అదేంటి, కేవలం రెండు రోజుల్లోనే రేవంత్ రెడ్డికి రెండు ఖైదీ నెంబర్లెలా వచ్చాయనుకుంటున్నారా? కోర్టు ఆదేశాల మేరకు చంచల్ గూడ జైలు నుంచి పోలీసులు రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. పలు కారణాలను చూపుతూ రేవంత్ కు భద్రత కల్పించలేమని చంచల్ గూడ జైలు అధికారులు కోర్టుకు మొరపెట్టుకున్నారు. జైలు అధికారుల పిటిషన్ ను పరిశీలించిన ఏసీబీ కోర్టు, రేవంత్ ను చంచల్ గూడ జైలు నుంచి చర్లపల్లి జైలుకు తరలించాలని నేటి మధ్యాహ్నం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. విచారణ ఖైదీగా చంచల్ గూడ జైల్లోకి అడుగుపెట్టిన రేవంత్ కు ఖైదీ నెంబరు 1779 కేటాయించగా, తాజాగా ఆయనకు చర్లపల్లి జైలు అధికారులు 4170ను కేటాయించారు. అదీ సంగతి!