: కేరళలో 'మ్యాగీ' అమ్మకాల నిలిపివేత


పలు రాష్ట్రాల్లో మ్యాగీ నూడుల్స్ అమ్మకాలు క్రమక్రమంగా నిలిచిపోతున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో నూడల్స్ పై పూర్తి స్థాయి నిషేధం విధించారు. తాజాగా కేరళ ప్రభుత్వం కూడా మ్యాగీ నూడుల్స్ అమ్మకాలు నిలిపివేయాలని రాష్ట్రంలోని దుకాణాలకు ఆదేశాలిచ్చింది. మ్యాగీలో హానికారక రసాయనాలు ఉన్నాయని ఇటీవల హరిద్వార్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు పరీక్షలు నిర్వహించి తేల్చారు. ఈ నేపథ్యంలో నూడుల్స్ అమ్మకాలను నిలిపివేస్తున్నారు. మరోవైపు హర్యానా ప్రభుత్వం కూడా మ్యాగీ నూడుల్స్ నమూనాలను పరీక్షలకు పంపింది.

  • Loading...

More Telugu News