: టీడీపీతో పొత్తు విషయం జాతీయ నాయకత్వమే నిర్ణయిస్తుంది: కిషన్ రెడ్డి


భవిష్యత్తులో టీడీపీతో పొత్తు విషయం తమ పార్టీ జాతీయ నాయకత్వమే నిర్ణయిస్తుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటును టీడీపీకే వేశామని, అయితే, రెండో ప్రాధాన్యత ఓటును నోటాకు వేశామని, నోటాకు ఓటు వేస్తే చెల్లదన్న విషయంపై తమకు అవగాహన లేదని వివరించారు. ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డిని సమర్థించడం లేదని, ఈ వ్యవహారాన్ని జాతీయ నాయకులతో చర్చిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. రేవంత్ తప్పు చేశాడా? లేక, ఆయన పార్టీ తప్పు చేసిందా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News