: చర్లపల్లి జైలుకు రేవంత్ రెడ్డి తరలింపు
నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టిన కేసులో రిమాండ్ ఖైదీగా వున్న టీ.టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని చంచల్ గూడ జైలు నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. ఆయనతో పాటు ఈ కేసులో సహ నిందితులు ఉదయ్ సింహ, సెబాస్టియన్ ను కూడా పోలీసులు చర్లపల్లికే తరలించారు. భారీ బందోబస్తు మధ్య రేవంత్ ను తీసుకువెళుతుండగా ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలు సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.