: ఆసుపత్రిలో చికిత్స చేయించాలంటూ రేవంత్ పిటిషన్... ముగిసిన వాదనలు

టీ.టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఆసుపత్రిలో చికిత్స చేయించాలంటూ రేవంత్ ఈరోజు పిటిషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం విచారణ చేపట్టింది. జైలు డాక్టర్ సూచన మేరకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో చర్లపల్లి జైలు వైద్యుడి అనుమతితో రేవంత్ కు వైద్య పరీక్షలు చేయించే అవకాశం ఉంది.