: ఎమ్మెల్యేలను కొనే సంస్కృతి రావడం దురదృష్టకరం: సీతారాం ఏచూరి
నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభపెడుతూ అవినీతి శాఖ అధికారులకు పట్టుబడిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారంపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పరోక్షంగా స్పందించారు. ఎమ్మెల్యేలను కొనే సంస్కృతి రావడం దురదృష్టకరమన్నారు. ఈ సంస్కృతిని అరికట్టాలంటే చట్టాలను కఠినతరం చేయాలన్నారు. హైదరాబాద్ లో ఈ మేరకు ఏచూరి మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించవద్దని సూచించారు. తెలంగాణలో 970 మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్నా, 3వేల మందికిపైగా వడదెబ్బ వల్ల మరణించినా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.