: వడ్డీలు తగ్గే కాలం... తొలి అడుగేసిన అలహాబాద్ బ్యాంక్
రెపో రేటును తగ్గిస్తూ, రిజర్వ్ బ్యాంకు తీసుకున్న నిర్ణయంతో బ్యాంకు రుణాలు తీసుకుని కిస్తీలు చెల్లిస్తున్న వారికి కొంత ఉపశమనం లభించనుంది. వడ్డీలు తగ్గించాలని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ చేసిన విజ్ఞప్తికి అలహాబాద్ బ్యాంకు స్పందించింది. తక్షణమే అమల్లోకి వచ్చేలా వడ్డీ రేటును 0.3 శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. మారిన వడ్డీ రేటు ప్రకారం 10.25 శాతంగా ఉన్న బేస్ రేటు ఇకపై 9.95 శాతానికి తగ్గుతుందని బ్యాంకు ఈ మధ్యాహ్నం బీఎస్ఈకి విడుదల చేసిన ఫైలింగ్ లో వెల్లడించింది. కాగా, ఆర్బీఐ రేటు తగ్గింపు తరువాత తొలిసారిగా స్పందించింది అలహాబాద్ బ్యాంకే.