: అప్పటి దాకా తల వెంట్రుకలు తీయను: ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ప్రతిజ్ఞ


సాగునీటి ప్రాజెక్టులకు, గండికోట జలాశయానికి నీరు తరలిస్తామని ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ సతీష్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ రోజు కడప మున్సిపల్ గ్రౌండ్స్ లో నవ నిర్మాణ దీక్ష సందర్భంగా బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గండికోటకు నీరు తెచ్చేంత వరకు తన తల వెంట్రుకలు కూడా తీయనని ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్ర నవ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని... ఆయనకు అందరూ సహకరించాలని విన్నవించారు.

  • Loading...

More Telugu News