: విద్యాబాలన్ కు రాయ్ యూనివర్శిటీ డాక్టరేట్
బాలీవుడ్ నటి విద్యాబాలన్ కు డాక్టరేట్ లభించింది. అహ్మదాబాద్ కు చెందిన రాయ్ యూనివర్శిటీ నుంచి ఆమె గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో విశేష సేవలందించిన నటీమణులకు రాయ్ వర్శిటీ ఈ డాక్టరేట్ ప్రదానం చేస్తోంది. ఈసారి విద్యాబాలన్ ను ఈ పురస్కారం వరించడం విశేషం. అనంతరం విద్యా మాట్లాడుతూ, గౌరవ డాక్టరేట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఇదే సమయంలో సినీ రంగంలో పదేళ్లు పూర్తి చేసుకున్నందుకు ఆనందంగా ఉన్నట్టు తెలిపింది.