: ఈ నెల 15 నుంచి దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ ఉచిత రోమింగ్ సదుపాయం


దేశవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి బీఎస్ఎన్ఎల్ ఉచిత రోమింగ్ సదుపాయం అమల్లోకి రానున్నట్టు కేంద్ర టెలికాం, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఢిల్లీలో వెల్లడించారు. స్పెక్ట్రమ్ పంపిణీ, ట్రేడింగ్ విధానంపై మంత్రివర్గంలో చర్చిస్తామని తెలిపారు. రెండు సంవత్సరాలలో ముఖ్య పర్యాటక ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ ద్వారా వైఫై సదుపాయం కల్పిస్తామని రవిశంకర్ వివరించారు. తమ ల్యాండ్ లైన్ బిజినెస్ ను పునరుద్ధరించుకునేందుకు గత నెలలో బీఎస్ఎన్ఎల్ రాత్రి వేళల్లో అన్ లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ బీఎస్ఎన్ఎల్ ఉచిత రోమింగ్ సదుపాయాన్ని తీసుకురావడం గమనార్హం.

  • Loading...

More Telugu News