: ఇన్ ఫ్లుయెంజాతో బాధపడుతున్న ప్రియాంక చోప్రా
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అనారోగ్యంపాలైంది. ఈ ముద్దుగుమ్మ ఇన్ ఫ్లుయెంజాతో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. అనారోగ్యానికి మందులు వాడుతున్నానంటూ అమ్మడు ట్విట్టర్లో పేర్కొంది. తన ఆరోగ్య పరిస్థితి పట్ల వాకబు చేసిన అందరికీ పీసీ కృతజ్ఞతలు తెలిపింది. కాగా, ప్రియాంక కొత్త సినిమా 'దిల్ ధడ్కనే దో' విడుదలకు సిద్ధంగా ఉంది. జూన్ 5న ఈ కుటుంబ కథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రమోషన్ ఈవెంట్లతో చిత్ర బృందం బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో, తన అనారోగ్యం కొంత నిరుత్సాహం కలిగిస్తోందని అమ్మడు పేర్కొంది.