: టీఆర్ఎస్ లో చేరినవాళ్లు కూడా డబ్బులిస్తేనే మారారా?: వీహెచ్

టీ.టీడీపీ నేత రేవంత్ రెడ్డి నోటుకు ఓటు వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు స్పందించారు. ఇంతవరకు టీఆర్ఎస్ లో చేరిన వాళ్లు (ఎమ్మెల్యేలు) డబ్బులిస్తేనే మారారా? అని ప్రశ్నించారు. దొరికితే దొంగలు, లేదంటే దొరలా? అని సూటిగా అడిగారు. వీటన్నిటిపై సీబీఐతో విచారణ జరిపించాలని వీహెచ్ డిమాండ్ చేశారు. కాగా రేవంత్ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబును కూడా విచారించాలని ఆయన కోరారు.