: టీఆర్ఎస్ కు ఓటేశారు... అంతలోనే కేసీఆర్ ను విమర్శించారు!


నిన్న జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వైకాపా మద్దతు పలికిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ అభ్యర్థికి వైకాపా ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు ఓటు వేశారు. అనంతరం, టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలులో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని... చివరకు అమరవీరుల కుటుంబాలను కూడా ఆదుకోలేకపోయారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఏడాది పాలనలో సామాన్యుడికి ఒరిగింది ఏమీ లేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యపై పోరాటం చేస్తామని... టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. అసలు ఓటు వేయడం ఎందుకో? ఆ తర్వాత ఈ విమర్శలు ఏందో? అంటూ పలువురు విస్తుపోతున్నారు.

  • Loading...

More Telugu News