: గాంధీభవన్ లో 'సోనియాగాంధీ కృతజ్ఞతా దినోత్సవం'
ఈరోజు (జూన్ 2) తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భావ దినోత్సవాలు, ఏపీలో నవనిర్మాణ దీక్ష జరుపుతుంటే... టీ.కాంగ్రెస్ నేతలు మాత్రం తమ అధినేత్రి సోనియాగాంధీ పేరుపై కృతజ్ఞతా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ, ఆంధ్రా ప్రాంతంలో కాంగ్రెస్ కు నష్టమని తెలిసినా సోనియా తెలంగాణ ఇచ్చారని అన్నారు. ప్రతి ఏడాది జూన్ 2న సోనియాగాంధీ కృతజ్ఞతా దినోత్సవం జరపాలని, తెలంగాణ చరిత్ర పాఠ్యాంశంలో సోనియా పేరు చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లు భట్టి విక్రమార్క, జానారెడ్డి, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.