: టీడీపీ నేతలపై విరుచుకుపడ్డ రేవంత్ సతీమణి గీత!


ఇంతమంది నేతలుండి తన భర్తను ఇరికించారని, ఆయన రాజకీయ భవిషత్తు ప్రశ్నార్థకమైందని తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి సతీమణి గీత ఆ పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. ఈ ఉదయం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు తెలంగాణ టీడీపీ నేతలు ఆయనింటికి వెళ్లగా ఈ ఘటన జరిగింది. కొందరు నేతలు ఆయనింటికి వెళ్లగా, గీత కోపంతో వారిని ఎందుకొచ్చారని ప్రశ్నించినట్టు సమాచారం. తన భర్తను కావాలనే కొందరు ఇరికించారని కూడా ఆమె ఆరోపించినట్టు తెలిసింది. కాగా, ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించిన దేశం నేతలు, ఈ కేసు నుంచి రేవంత్ బయటపడతాడని, తామంతా ఆయన వెనకే ఉన్నామని చెప్పి బయట పడ్డారట.

  • Loading...

More Telugu News