: మ్యాగీ నూడుల్స్ తినండి...సురక్షితమే!: నెస్లే ఇండియా


మ్యాగీ నూడుల్స్ లో హానికరమైన రసాయనాలు ఉన్నాయని హరిద్వార్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీఏ) ఓ వైపు కేసు నమోదు చేస్తే, నెస్లే ఇండియా మాత్రం అందుకు భిన్నంగా ప్రకటనలిస్తోంది. తమ ప్రయోగశాలలోనే కాకుండా, బయట కూడా ఈ నూడుల్స్ కు పరీక్షలు జరిపించామని, ఇవి తినడం వల్ల ఎటువంటి ప్రమాదమూ లేదని తేలిందని నెస్లే ఓ ప్రకటనలో తెలిపింది. మరిన్ని పరీక్షల కోసం మ్యాగీ నూడుల్స్ కు సంబంధించి దాదాపు 600 ప్రొడక్ట్ బ్యాచ్ లకు చెందిన శాంపిల్స్ ఇచ్చామని, ఇప్పటికే తాము వెయ్యి బ్యాచ్ లకు చెందిన ఉత్పత్తులకు గుర్తింపు పొందిన ప్రయోగశాలలో పరీక్షలు చేయించామని నెస్లే వివరించింది. పరీక్షలు జరుపుతున్న అధికారులకు పూర్తిగా సహకరిస్తామని, తాము కూడా వాటి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పింది.

  • Loading...

More Telugu News