: పాక్ కెప్టెన్ మిస్బా 'లాండ్ క్రూజర్' కారు సీజ్


ఎంతో కాలంగా పాకిస్థాన్ క్రికెట్ కు సేవలందిస్తూ... ప్రస్తుతం టెస్ట్ కెప్టెన్ గా కొనసాగుతున్న మిస్బా ఉల్ హక్ కు చేదు అనుభవం ఎదురైంది. మిస్బాకు చెందిన లాండ్ క్రూజర్ కారును 'ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అండ్ ట్యాక్సేషన్' అధికారులు సీజ్ చేశారు. తన లాండ్ క్రూజర్ కు సంబంధించిన కస్టమ్స్ డ్యూటీని మిస్బా చెల్లించలేదని, అందుకే అతని కారును సీజ్ చేశామని అధికారులు స్పష్టం చేశారు. కస్టమ్స్ డ్యూటీతోపాటు, పెనాల్టీని కూడా చెల్లించాలని మిస్బాకు ముందుగానే నోటీసులు ఇచ్చామని... అయినా, అతను స్పందించకపోవడంతో ఈ పని చేశామని చెప్పారు. శ్రీలంకతో జరగనున్న మూడు టెస్టుల సిరీస్ కోసం ప్రస్తుతం మిస్బా సిద్ధమవుతున్నాడు.

  • Loading...

More Telugu News