: కరోనా వైరస్... తరుముకు వస్తోంది!


మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్... సంక్షిప్తంగా ఎంఈఆర్ఎస్ (మెర్స్) అని పిలుచుకునే మహమ్మారి మళ్లీ జడలు విప్పుకుంది. కరోనా వైరస్ కారణంగా ఇది వ్యాప్తి చెందుతుంది. సౌదీ అరేబియాలో 2012లో దీన్ని గుర్తించారు. ఆ తర్వాత మధ్య ప్రాచ్యం, దక్షిణ ఆసియా దేశాలను గడగడలాడించిందీ వైరస్. ఈజిప్టు, టర్కీ, అల్జీరియా, ఒమన్, యూఏఈ, జోర్డాన్, మలేసియా, బంగ్లాదేశ్, ఇండోనేషియా తదితర దేశాలపై పంజా విసిరింది. తాజాగా దక్షిణ కొరియాలో ప్రత్యక్షమైంది. ఈ వైరస్ బారినపడి దక్షిణ కొరియాలో ఇద్దరు ప్రాణాలు విడిచారు. మరో పాతికమందికి వైరస్ సోకినట్టు గుర్తించారు. వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి, చికిత్స అందిస్తే ప్రాణహాని ఉండదు. కరోనా వైరస్ సోకితే స్వైన్ ఫ్లూ తరహా లక్షణాలు కనిపిస్తాయి.

  • Loading...

More Telugu News