: స్కేటింగ్ చేస్తూ తిరుపతి నుంచి అమరావతి బయలుదేరిన ఎనిమిదేళ్ల చిన్నారి
ఓ ఎనిమిదేళ్ల చిన్నారి ఎండా వానలను లెక్కచేయకుండా నవ్యాంధ్ర నవనిర్మాణం కోసం సాహసోపేత ప్రయాణాన్ని ప్రారంభించింది. తిరుపతి నుంచి స్కేటింగ్ చేస్తూ, ఏపీ రాజధాని అమరావతికి బయలుదేరింది. ఈ నెల 6వ తేదీన అమరావతిలో జరిగే భూమి పూజలో పాల్గొనాలన్నది ఆ చిన్నారి అభిలాష. ఆ పాప పేరు యేష. స్కేటింగ్ లో అసమాన ప్రతిభా పాటవాలు ఆమె సొంతం. అందుకే దాదాపు 430 కిలోమీటర్ల దూరాన్ని స్కేటింగ్ చేస్తూ పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. తాను దాచుకున్న డబ్బును రాజధాని నిర్మాణం కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇవ్వాలన్నది ఆ పాప కోరిక.